ఏపిలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ తీవ్రమైన ప్రతికూలతల మధ్య బరిలోకి దిగింది. అధికార పార్టీ ఒత్తిళ్లు ఎదుర్కొని 180 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకుందని… తూర్పు గోదావరి జిల్లా, కడియంతో కలిపి రెండు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుందని ఇందుకోసం జనసైనికులు ఎంతో కష్టపడ్డారని పవన్ కళ్యాన్ అన్నారు.
ఈ సందర్భంగా పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇక జనసేన ఎంపీటీసీ విజేలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ గెలుపు కోసం తాము ఎలా కష్టపడ్డారు.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల వత్తిడి నుంచి ఎలా ఎదుర్కొన్నారు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ కి వివరించారు.
ఈ నేపథ్యంలో ఎంపీటీసీలు చెప్పిన విషయాన్ని ఓ నోట్ బుక్ లో రాసుకున్నారు. భవిష్యత్ లో పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ప్రజలకు మంచి చేస్తే వారే మనల్ని గుర్తిస్తారని పవన్ కళ్యాణ్ వారితో అన్నారు. ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకు రావాలని.. తాను సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటానని అన్నారు.