పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అటు హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు ఎంతో దగ్గరయ్యాడు. పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఉన్న మాట అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం కూడా అందరికీ తెలుసు అభిమానులు మాత్రమే కాదు పవన్‌కు భక్తులు కూడా ఉన్నారని. ఆ అభిమానులు ప్రతిసారి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తుంటారు. సెప్టెంబర్ 2 దగ్గర పడటంతో ఫ్యాన్స్ హంగామా షురూ చేశారు.
ఈ బర్త్ డేని మరింత స్పెషల్ గా మార్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ పాత వీడియో తెగ వైరల్ గా మారింది. అది పాత వీడియో అని తెలియక చాలా మంది ఇప్పటిదే అనుకుంటున్నారు. విషయం ఏంటంటే.. పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు ఆయన పేరు మీద ఎర్ర కండువాలతో మాల వేసుకున్నారు. 49 రోజులపాటు పవన్ కల్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
కొందరు అభిమానులు పవన్ కల్యాణ్ 49వ జన్మదినం సందర్భంగా 49 రోజుల ముందు పాలకొల్లులో ఎర్ర కండువాలతో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే ఆ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అంతా అది కొత్త వీడియో అనుకుని షేర్ చేస్తున్నారు. కొందరు ఈ వీడియోపై కథనాలు కూడా ప్రచురిచండంతో మరింత వైరల్ గా మారింది. ఈ పాత వీడియో వైరల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Red Towel Tho 49 Days Pawan Kalyan Mala 😂😂😂😂 …Sainiks#Pawanakalyan #Janasena pic.twitter.com/DM3K1an6kx
— RaviTeja (@RaviTej59642623) August 16, 2022