తెలుగు సినీ ప్రపంచంలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి..రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ స్థాయిలోనూ అనేక సంచలనాలు సృష్టించారు. సినిమాలోను ఆయనది ఓ ఘనమైన చరిత్ర. ఆయన అనంతరం సినీ రంగలో హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు.. స్టార్ హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో తారక్ ఒకరు. తనదైన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు పొందాడు. అయితే గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాలపై కొందరు జూనియర్ ఎన్టీఆర్ ను పరుష పదజాలంతో దూషించారు. వైసీపీ ప్రభుత్వం.. నందమూరి కుటుంబపై దాడి చేస్తుంటే గట్టింగా స్పందించేరేమి? అంటూ కొందరు ఎన్టీఆర్ పై పరోక్షంగా విరుచకపడ్డారు. అయితే తాజాగా బాలయ్య..మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మహానేత అంటూ కీర్తించారు. బాలయ్య చేసిన ఆ పని.. మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం. అయితే ..వైఎస్ ను బాలయ్య కీర్తిచడంపై ఎన్టీఆర్ ను తిట్టిన వాళ్లు ఏమి అనలేదు. ” బాలయ్యను అనే ధైర్యం లేదా? ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిన వారు ఈ రోజు ఏమయ్యారు?” అని కొందరు విమర్శిస్తున్నారు.
అన్ స్టాపబుల్-2 షోలో నందమూరి నటసింహ బాలకృష్ణ.. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గొప్పగా కీర్తించారు. ఆయన మహానేతని, గొప్ప లీడర్ అని ప్రశంసించారు. రాజకీయాల్లో ప్రత్యర్ధులైన వారిని సైతం కీర్తించడం బాలకృష్ణ గారి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు. అనేక సందర్భాల్లో బాలకృష్ణ రాజకీయలకు అతీతంగా అందరిని కలుపుకుని పోతుంటారు. ఇతర పార్టీల నేతలపై ఆయన చూపించే గౌరవ మర్యాదలకు గతంలో జరిగిన అనేక ఘటనలే ఉదాహరణ. ఇక మరొకవైపు నందమూరి ఫ్యామిలీ విషయంలో వైకాపా దారుణంగా ప్రవర్తిచిదంటూ..ఆ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందిచలేదని కొందరు తెలుగు తమ్ముళ్లు విమర్శించారు. నందమూరి ఆడబిడ్డకు అవమానం, యూనివర్సిటీ పేరు మార్పు వంటి వాటిపై ఎన్టీఆర్ కొందరు తిట్టారు. అలాంటి వారు వైసీపీ ఆధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రిని బాలకృష్ణ కీర్తిచడంపై నోరు మెదపడం లేదు. అంటే బాలకృష్ణను అనే ధైర్యం వారికి లేదా? అని కొందరు విమర్శిస్తున్నారు. బాలకృష్ణ చేసినది మంచి వ్యాఖ్యలే అయినప్పటికే ఎన్టీఆర్ ను తిట్టిన వారికి రుచించవు కదా? అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022
గత కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు గమనిస్తే.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో కొందరు నారా భువనేశ్వరిని అవమానించారంటూ తెదేపా నేతలు ఆరోపించారు. ఆ విషయంపై నందమూరి కుటుంబ సభ్యులు గట్టిగానే స్పందించారు. ఈక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. రాజకీయాల్లోకి ఆడవారిని లాకగడం సరైనది కాదంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అలానే ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారు. దీనిపై తెదేపా నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. చాలా చోట్ల యూనివర్సిటీ పేరు మార్పుపై ఆందోళనలు జరిగాయి. యూనివర్సిటీ పేరు మార్చి ఎన్టీఆర్ ను అవమానించారంటూ తెదేపా నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచక పడ్డారు. ఇదే విషయంపై నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత పురంధేశ్వరి సైతం యూనివర్సిటీ మార్పును తీవ్రగా వ్యతిరేకించారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం హెల్త్ యూనివర్సిటీ మార్పుపై స్పందించారు.
“ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి..మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేలేరు” అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయితే ఈ విషయంలో తారక్ ను కొందరు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ను అవమానిస్తే .. తారక్ స్పందించే తీరు ఇదేనా? అంటూ తిట్టారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి..జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ వాళ్లతో జతకట్టినట్లు విమర్శించారు. అయితే తాజాగా అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ..రాజశేఖరెడ్డిని ప్రశంసించారు. గతంలో జూనియర్ ఎన్టీర్ స్పందించిన తీరు సరైనదే.. అలానే తాజాగా బాలయ్య రాజశేఖర్ రెడ్డిని ప్రశంసించడం మంచి విషయమే. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. అనాడు జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిన వాళ్లు బాలయ్యపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. “తారక్ ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? బాలయ్యని తిట్టే ధైర్యం లేదా?” అంటూ కొందరు విమర్శిస్తున్నారు.