టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 93వ రోజుకి చేరుకుంది. 93వ రోజు పాదయాత్ర కర్నూలు నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 93వ రోజుకి చేరుకుంది. 93వ రోజు పాదయాత్ర కర్నూలు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతి రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం కూడా విడిది కేంద్రంలో 1000 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. అలానే తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ లోకేశ్ కి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు నియోజవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. 93వ రోజు కర్నూలు నియోజవర్గంలో ప్రారంభమైంది. ఈరోజు పాదయాత్రలో భాగంగా కర్నూలులోని శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనే అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గొప్ప మనిషని, ఆయనకు తగిన గౌరవం కల్పిస్తామని.. ఆయన సేవల గుర్తులతో మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లోకేష్ ను కలిసిన మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు.. తమ సమస్యలను వివరించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్దరిస్తామని లోకేశ్ అన్నారు. ఇక పాదయాత్రలో జిల్లా కోర్టు భవనం ముందు లోకేశ్ ని జిల్లా న్యాయవాదలు కలిసి పాదయాత్రకు సంఘీ భావం తెలిపారు.
కర్నూలు గడియారం హాస్పటల్ సెంటర్ లో ఆటో కూలీల తో నారా లోకేశ్ ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. అలానే కొండారెడ్డి బురుజు వద్ద ఏపీ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి వృత్తిపని వారందరికీ చేతినిండా పని కల్పిస్తామని యువనేత హామి ఇచ్చారు. ఇలా ప్రజలతో మమేకమవుతూ లోకేశ్ తన 93వ రోజు పాదయాత్రను పూర్తి చేశారు. మరి.. 93వ రోజు కర్నూలులో సాగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.