టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 89వ రోజుకి చేరుకుంది. 89వ రోజు పాదయాత్ర పాణ్యం నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 89వ రోజుకి చేరుకుంది. 89వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతి రోజు సుమారుగా 1000 నుంచి 1500 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. గురువారం కూడా విడిది కేంద్రంలో దాదాపు 1500 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. అలానే తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ యువనేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కర్నూలు జిల్లాలో విశేష స్పందన వస్తోంది. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. లోకేశ్ బాబుకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ లోకేశ్ కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది.
ఇక పాదయాత్రలో పాణ్యం నియోజవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలను కలుసుకున్నారు. బొల్లవరం లో మహిళలతో నారా లోకేశ్ ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఫ్యాన్ ఆరోగ్యానికి హానికరమని, ఫ్యాన్ ఆపేస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయని అన్నారు. ఇంకా లోకేశ్ మాట్లాడుతూ..” జగన్ బాదుడే బాదుడు కి ప్రజలు అల్లాడుతున్నారు. కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచారు, ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను వేసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించి ధరలు తగ్గేలా చేస్తాం.
టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తాం. డ్వాక్రా వ్యవస్థను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. వడ్డీ లేని రుణాలు ఇస్తాం అని మోసం చేశారు. ఆఖరికి మీరు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కొట్టేసింది. మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం” అని లోకేశ్ అన్నారు. ఇలా ప్రజలతో మమేకమవుతు లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు. మరి..89వ రోజు లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.