టీడీపీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద హైదరాబాద్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరలయిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.1600 కోట్లతో బ్రాహ్మణి ఫామ్‌హౌస్ కొనుగోలు చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. అయితే ఈ వార్తలని టీడీపీ ఖండించింది. అవన్ని ఫేక్ వార్తలని కొట్టిపారేసింది. ఈ వివాదానికి సంబంధించి తాజా సమాచారం ఏంటంటే.. ఇలాంటి తప్పుడు ప్రచారానికి దిగిన వారిపై నారా బ్రాహ్మణి సీరియస్ అయ్యిందని.. త్వరలోనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
‘తన పైనా, తన భార్య పైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా పోలీసు బలగాన్ని పంపి కేసులు పెట్టించే జగన్ రెడ్డి.. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడు. తనకో ధర్మం ఎదుటివాళ్లకు ఇంకో ధర్మం ఏంటో తేల్చుకోడానికి రంగం సిద్ధమవుతోంది. నారా బ్రాహ్మణి గారు నిరుపేద అని, అటువంటి మహిళ రూ.1600 కోట్లతో దివంగత జయలలితకు చెందిన ఫార్మ్ హౌస్‌ను కొన్నారని.. అంతటి డబ్బు ఆమెకు ఎక్కడిది అంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్‌లో కొందరు ఫేక్ పోస్టులు పెట్టారు. వారిపై పరువు నష్టం దావా వేసేందుకు నారా బ్రాహ్మణి సిద్ధం అవుతున్నారు’ అని టీడీపీ క్లారిటీ ఇచ్చింది. న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారని.. పోస్టులు పెట్టినవారిపై త్వరలోనే పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
తన పైనా తన భార్య పైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా పోలీసు బలగాన్ని పంపి కేసులు పెట్టించే జగన్ రెడ్డి… స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడు. తనకో ధర్మం ఎదుటివాళ్లకు ఇంకో ధర్మం ఏంటో తేల్చుకోడానికి రంగం సిద్ధమవుతోంది(1/2)#YCPpaytmBatch#FakeYCPBatch pic.twitter.com/sKd7XafOCi
— Telugu Desam Party (@JaiTDP) October 25, 2022
హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ దగ్గర్లో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఓ పెద్ద ఫామ్ హౌస్ ఉంది. 25 ఎకరాల విస్తీర్ఱంలో ఉన్న ఈ ఫామ్‌హౌస్ పేరు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక తాజాగా దీన్ని నారా బ్రాహ్మణి కొనుగోలు చేశారంటూ.. అది కూడా ఏకంగా 1600 కోట్ల రూపాయలు చెల్లించి మరి సొంతం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో కావడంతో.. మరోసారి ఈ ఫామ్‌హౌస్ వార్తల్లో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. తాజాగా ఈ ఫామ్ హౌస్ దగ్గర మరో కంపెనీకి చెందిన ఆస్తిగా ఓ బోర్డును ఏర్పాటు చేశారట.
అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అక్కడితో ఆగకుండా ఫామ్‌హౌస్ కొనుగోలు చేసిన ఆ కంపెనీ ప్రతినిధులు బ్రాహ్మిణికి తెలిసినవారిని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ టీడీపీ ఇదంతా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చింది. ఫ్యాక్ట్ చెక్ టీడీపీ అనే ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్‌ను టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి దాన్ని రీట్వీట్ చేశారు.