తనను నియోజకవర్గం నుంచి తరిమికొడతాం అన్న వైసీపీ నేతలకు సవాల్ విసురుతూ.. గురువారం ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని, ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరాడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్. దాంతో అక్కడ వాతావారణం ఒక్కసారిగా హీటెక్కింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. ఇక వైసీపీ నుంచి సస్పెండ్ అయిన వారిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. ఇక తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన దగ్గర నుంచి మాటల్లో మరింత దూకుడు పెంచారు ఆయన. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేస్తూ.. సింగిల్ డిజిట్ తో గెలిచిన అనిల్.. 35 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నాకు సవాల్ విసరడం ఏంటని ఎద్దేవ చేశాడు. ఇక తనను నియోజకవర్గం నుంచి తరిమికొడతాం అన్న వైసీపీ నేతలకు సవాల్ విసురుతూ.. గురువారం ఆయన ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని, ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరాడు.
ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. మరీ ముఖ్యంగా నెల్లూరు పాలిటిక్స్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నట్లుగా సాగుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో నెల్లూరు జిల్లా దద్దరిల్లిపోతోంది. ఈక్రమంలోనే వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన మేకపాటిని ఉదయగిరి నియోజకవర్గం నుంచి తరిమి కొడతాం అంటూ కొంత మంది వైసీపీ నాయకులు రొడ్డెక్కారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేకపాటి.. తాజాగా ఉదయగిరి ఆనకట్ట బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. నేను వస్తే తరిమికొడతాం అన్న వాళ్లు రావాలి అంటూ సవాల్ విసిరాడు.
ఆ ప్రాంతంలో కొద్దిసేపు కలియతిరిగి, అక్కడ ఉన్న శ్రేణులకు పలకరించాడు. అనంతరం నేను పార్టీలో లేను అని కొందరు ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు అని, వైసీపీ అధిష్టానం తనపై మోపినవన్నీ అబద్దాలే అని మేకపాటి ఈ సందర్భంగా పేర్కొన్నారు. దమ్ముంటే నన్ను ఈ నియోజకవర్గం నుంచి తరిమికొట్టాలి అంటూ మరోసారి సవాల్ విసిరాడు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. వచ్చే ఎన్నికల్లో నాతో పాటుగా ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు గెలవడం ఖాయం అని జోస్యం చెప్పారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.
ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సవాల్
ఉదయగిరికి వస్తే తరుముతామన్న వాళ్లు రావాలంటూ ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చున్న చంద్రశేఖర్ రెడ్డి pic.twitter.com/E8c02pplE8
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2023