Whatsapp Photo : 19 ఏళ్ల క్రితం కుటుంబాన్ని వదలిపెట్టి వెళ్లిపోయిన ఓ వ్యక్తి.. వాట్సాప్ మెసేజ్ కారణంగా మళ్లీ కుటుంబంతో కలిశాడు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన ఫొటో మెసేజ్ ఆధారంగా తండ్రిని కనుక్కున్నాడు అతడి కొడుకు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా, కోవూరు గమళ్ల పాళానికి చెందిన బండ్ల సురేష్‌కు 2004లో వివాహం అయింది. వివాహం జరిగిన కొన్నిరోజులకే సురేష్ తండ్రి సుబ్బారావు కనిపించకుండా పోయాడు. తండ్రి జాడకోసం సురేష్ ఎంత గానో ప్రయత్నించి విసిగిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 ఏళ్ల పాటు తండ్రి కోసం వెతికివెతికి, ఆచూకీ దొరక్క బాధలో మిగిలిపోయాడు.
అయితే, 19 ఏళ్ల తర్వాత ఓ వాట్సాప్ మెసేజ్ కారణంగా అతడి తండ్రి ఆచూకీ దొరికింది. ఓ రోజు సురేస్ ఉండే వాట్సాప్ గ్రూపులో ఓ మెసేజ్ వచ్చింది. అది కూడా ఓ ఫొటో. ఆ ఫొటోలో సుబ్బారావు కనిపించటంతో.. ఆ ఫొటో ఎక్కడిదని సురేష్ ఆరాతీయటం మొదలుపెట్టాడు. అతి కష్టం మీద తండ్రి ఆచూకీ పట్టుకోగలిగాడు. ఆయన కేరళలోని కొట్టాయంలో ఉన్నాడని తెలుసుకుని ఆక్కడికి వెళ్లాడు. తండ్రి ఉంటున్న నవజీవన్ ట్రస్ట్ వారిని సంప్రదించి, ఆయన తన తండ్రే అని నిరూపించే ఆధారాలు చూపించి, వారి అనుమతి, తండ్రి ఇష్టంమీద ఆయన్ని నెల్లూరుకు తీసుకువచ్చాడు. 19 ఏళ్ల తర్వాత సుబ్బారావును చూడటంతో కుటుంబం మొత్తం సంతోషంలో తేలియాడుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఏపీలో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించిన హైకోర్టు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.