చాలా మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకే రిజర్వేషన్లు చేయించుకుని మరి.. రైళ్లలో ప్రయాణలు చేస్తుంటారు. కొందరు స్టేషన్ కి వెళ్లే సమయానికే ట్రైన్ వెళ్లిపోయి ఉంటుంది. దీంతో వారు నిరుత్సాహం ఇంటికి వెనుతిరుగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు మిస్సైన రైలును ఆపేందుకు అతి తెలివి చూపించాడు.
చాలా మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకే రిజర్వేషన్లు చేయించుకుని మరి.. రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారు. ఇలా ప్రయాణాల సమయం లో కొందరు సమయానికి ట్రైన్ కు అందుకోలేరు. వారు వెళ్లే సమయానికే ట్రైన్ స్టేషన్ నుంచి వెళ్లుటుంది. దీంతో వారు నిరుత్సాహం ఇంటికి వెనుతిరుగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు మిస్సైన ట్రైన్ ను ఆపేందుకు అతి తెలివి చూపించాడు. చివరకు ఆయన ప్లాన్ రివర్స్ కొట్టి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం గొల్లపల్లి తండాకు చెందిన తేజేశ్వర్ నాయక్ తిరుపతిలో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సెలవులు పెట్టుకుని అతడు, భార్యతో సహా సొంత ఊరికి వచ్చాడు. తిరిగి భార్యతో కలిసి తిరుపతికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 3న మధ్యాహ్నం కదిరి రైల్వే స్టేషన్ లో తిరుపతి వెళ్లే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో వీరు ఎక్కాల్సి ఉంది. అయితే తాను వెళ్లే సరికి రైలు వెళ్లిపోతుందని తేజేశ్వర్ భయపడ్డాడు.
అయితే తాను స్టేషన్ కి వెళ్లే వరకు ఆ రైలు ఆపాలని తేజేశ్వర్ భావించాడు. దీంతో వెంటనే తన ఫోన్ నుంచి కదిరి రైల్వేస్టేషన్ మేనేజర్ కి ఫోన్ చేశాడు. కదిరి-నల్లచెరువు మధ్య రైల్వే ట్రాక్ సరిగ్గా లేదని చెప్పాడు. ఫోన్ కాల్ తో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. 15 కి.మీ దూరం వరకు ట్రాక్ ను పరీక్షించారు. అయితే ఎక్కడ ట్రాక్ దెబ్బతిన్నట్లు వారికి కనిపించలేదు. రైల్వే సిబ్బందికి క్లారిటీ వచ్చిన ఆ తర్వాత రైలును పంపించారు. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును కదిరి స్టేషన్‌లో గంట సమయం పాటు నిలిపోయింది.
ఈ లోపు తేజేశ్వర్ కదిరికి చేరుకుని అదే రైలులో భార్యతో కలసి తిరుపతికి వెళ్లాడు. ఇక ఇది ఆకతాయిల పనే అనే అనుమానంతో పోలీసులు కదిరి స్టేషన్ మేనేజర్ సహకారంతో ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ పై ఆరాచ తీశారు. పోలీసుల దర్యాప్తులో తేజేశ్వర్ చేసిన ఘన కార్యం బయటపడింది. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయేందుకు కారణమైన అతడిపై పోలీసులు కేసు నమోదు అరెస్ట్ చేశారు. మరి.. అతడు ఏదో అనుకుంటే మరేదో జరిగింది. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.