ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురువారం చంద్రబాబు రోడ్ షో నిమ్మకూరు నుంచి గుడివాడ వరకు సాగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. నిమ్మకూరులో జరిగిన చంద్రన్న ఆత్మీయ సమ్మేళనంలో ఓ బుడతడు ఎన్టీఆర్ డైలాగ్ చెప్పి.. అందరిని ఆకట్టుకున్నాడు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురువారం చంద్రబాబు రోడ్ షో నిమ్మకూరు నుంచి గుడివాడ సాగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అలానే గురువారం రాత్రి గుడివాడలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అంతకు ముందు నిమ్మకూరులో జరిగిన ఆత్మీయ సమ్మేళ్న కార్యక్రమంలో ఓ బుడ్డోడు అందరిని ఆకర్షించాడు. సభవేదికపై దానవీర్ణశూర కర్ణ సినిమాలోని భారీ డైలాగ్ ను గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. దీంతో చంద్రబాబు తో సహా వేదికపై ఉన్నవాళ్లందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ చిన్నోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిమ్మకూరు లో జరిగిన చంద్రన్న ఆత్మీయ సమ్మేళ్నంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నబాబు ఎన్డీఆర్ డైలాగ్ ను చెప్పి అందిరిని ఆకట్టుకున్నాడు. డైలాగ్ చెప్పే ముందు కూడా చంద్రబాబు వద్దకు వెళ్లి.. ఆయన కాళ్లకు నమష్కరించాడు. ఆయన కూడా ఆ బాలుడిని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించాడు. అనంతరం మైక్ అందుకున్న ఆ బుడతడు.. “దానవీర శూరకర్ణ” సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన భారీ డైలాగ్ ను అందుకున్నాడు. ఇక గుక్కతిప్పుకోకుండా ఏకధాటిగా డైలాగ్ మొత్తాన్ని అవలీలగా చెప్పేశాడు. ఆ బాలుడు డైలాగ్ చెప్తునంత సేపు చంద్రబాబు నాయుడితో సహా అందరు ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అంతేకాక తమ కరతాళ ధ్వనులతో ఆ బాలుడికి మరింత ప్రోత్సాహం అందించారు.
ఇక ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ, హరికృష్ణ తనయురాలు సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఇక ఆ బుడతడు చివర్లో మరోసారి చంద్రబాబు వద్దకు వెళ్లి నమష్కారాలు తీసుకున్నారు. అదే సమయంలో ఆ బాలుడిని చంద్రబాబు అక్కున చేర్చుకున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి డైలాగ్ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. అలానే నెటిజన్లు ఆ బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన ప్రదర్శన చేశావు బుడత.. నీవు భవిష్యత్ లో ఉన్నత శిఖరాలలకు చేరాలని కోరుకుంటున్నాము అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వీడియోను మీరు వీక్షించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.