KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ ఏపీలో మంచి పాలన సాగిస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ కొనియాడారు. హిందూ ఎడిటోరియల్ టీమ్ భేటీలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ ఆంధ్రాలో మా అన్న వైఎస్ జగన్ మంచి పాలన అందిస్తున్నారు. యువ ముఖ్యమంత్రిగా అద్భుతంగా పాలిస్తున్నారు. ఆయన 2019లో ముఖ్యమంత్రి అయినపుడు కోవిడ్‌తో పోరాడాల్సి వచ్చింది. ఆ సమయంలో కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు’’ అంటూ కొనియాడారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, సంక్షేమ పథకాల అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా నివేదికల ప్రకారం.. ఈ ఏడాది 7 నెలల వ్యవధిలోనే ఏపీ దేశవ్యాప్తంగా వచ్చిన పారిశ్రామిక పెట్టుబడుల్లో దాదాపు 45 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఆర్ధికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. జీడీపీలో మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను సైతం ఏపీ దాటేసింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ పారిశ్రమిక విధానంపై..
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రముఖ సంస్థ టాటా సన్స్ ప్రశంసలు కురిపించింది. ఏపీ పారిశ్రామిక విధానం పెట్టుబడులకు దన్నుగా ఉందని.. ఆ సంస్థ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ కొనియాడారు. రాష్ట్రంలో టాటా సన్స్ గ్రూప్ పెట్టుబడులకు సిద్ధంగా ఉందని తెలిపారు. మరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసలు కురిపించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మా అన్న జగన్ పాలన అద్భుతం -తెలంగాణ మంత్రి కేటీఆర్🔥 pic.twitter.com/RPj4FzuEkk
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) September 21, 2022
ఇవి కూడా చదవండి : CM జగన్ పై టాటాసన్స్ సంస్థ చైర్మన్ నటరాజన్ ప్రశంసలు