రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి నేడు. వివక్షను సమాజం నుంచి తరిమికొట్టేందుకు అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రజాస్వామ్యం, అంటరానితనం, కుల నిర్మూలన, ఆర్థిక సంస్కరణలు దళితులు, భారతదేశ చరిత్ర లాంటి విశేషమైన రచనలు మనకు అందించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. నిత్య చైతన్యమూర్తి, కారణజన్ముడు బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ అని పవన్ అన్నారు. నేడు ఆ మహానుభావుడు పరమపదం చెందిన పుణ్యతిది. ఆ దీనజనోద్ధారునికి భక్తిపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు.
‘నేను ఆరాధించే గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయం. ఆయన పట్ల నాకున్న భక్తి భావనే లండన్‌లో ఆయన నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన స్మారక మందిరాన్ని సందర్శించేలా చేసింది. దేశంలో నిరంతరాయంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ గారు ఆద్యులుగా చెప్పుకోవడం మనకు గర్వకారణం.. రాజ్యంగంలోని నాడు ఆయన కల్పించిన పౌర హక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తాయి. నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరిత్యాలను ముందే పసిగట్టి ప్రజలకు ఇటువంటు రక్షా బంధనం రూపొందించారేమోనని ప్రస్తుత పరిస్థితులలో అనిపించక మానదు. భారత దేశంలో పుట్టిన ఒక గొప్ప మేధావి, మానవతా విలువలు మూర్తీభవించిన మహా మనిషిగా ప్రపంచం కొనియాడారు.’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు – JanaSena Chief Shri @PawanKalyan #Ambedkar pic.twitter.com/l2vvuJmzha
— JanaSena Party (@JanaSenaParty) December 6, 2021