గత కొన్నిరోజుల నుంచి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
మార్చి నెల రావడంతో ఇప్పటి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీకి భారీ వర్ష సూచన అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధిక ఉష్ణోగ్రత నుంచి ప్రజలు ఉపశమనం పొందున్నారు. ఈ వర్షాలు మార్చి 16 నుంచి 20 వరకు ఏపీతో పాటు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా ఈ ద్రోణి ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు.
దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా అక్కడక్కడ చలిగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి భయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఈ వర్ష సూచనతో అధిక ఉష్ణోగ్రత తగ్గి చల్లని గాలులు వీస్తాయి. దీని ప్రభావంతో దేశంలోని తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి ఏపీతో పాటు తెలంగాణలో 2,3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.