ఇటీవల కాలంలో తరచూ భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు అగ్నికి ఆహుతి అవుతున్నారు. మరికొందరు కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. అగ్నిప్రమాదాల కారణంగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. శనివారం నెల్లూరు జిల్లాలోనూ ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ మధ్యకాలం తరచుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్య్కూట్, ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ అగ్నిప్రమాదాల్లో ఎందరో అమాయకులు కాలిబుడిదై పోతున్నారు. గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ లాడ్జ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అలానే ఇటీవల కొంతకాలం క్రితం రాంగోపాల్ పేట్ ప్రాంతలో నాలుగు అంతస్తుల ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లా కలెకర్ట్ కార్యాలయంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
శనివారం ఉదయం నెల్లూరు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఇవాళ రెండో శనివారం కావడంతో సిబ్బంది ఎవరు విధుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కలెక్టర్ కార్యాలయం లో భద్రపరిచిన ఎన్నికల సామాగ్రి పూర్తిగా దగ్ధమైందని సమాచారం. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. అలానే ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఏ ఫైళ్లు దగ్ధం అయ్యాయి, ఎంతవరకు నష్టం కలిగిందని అనే అంశాలు తెలియాల్సి ఉంది.