ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం(ఏప్రిల్ 22) ఒంగోలులో పర్యటించారు. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీలో భాగంగా సీఎం ఈ పర్యటన చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 12వందల కోట్ల రూపాయల వడ్డీ రాయితీని వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే.. జగన్ ఒంగోలు పర్యటనలో ఓక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
‘జగనన్నా నేను నీ వాలంటీర్ ని.. ఒక్కో ఫోటో అన్నా’ అన్న మాట విన్న సీఎం జగన్ భవనం పై ఉన్న వాలంటీర్ ని తన వద్దకు తీసుకు రావాలంటూ సిబ్బందికి ఆదేశించడంతో వాలంటీర్ షీలా రాణి ఆశ నెరవేరింది. ‘ఏం పేరు తల్లీ ఎక్కడ చేస్తున్నా’వు అంటుా అడిగిన సీఎంకు ‘ఒంగోలు రంగుతోటలో చేస్తున్నానని’.. మీతో ఫోటో దిగడం వల్ల తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: పుష్ప సినిమా రియల్ సీన్!