వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి ఏపీలో అధికార, ప్రతిపక్షాలు వ్యూహరచనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని.. రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తే.. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తు ప్రచారం చేస్తున్నారు అధికార పక్ష నేతలు. ఈ క్రమంలో జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతూ వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారిపోతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాలు వ్యూహరచనలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రస్తుతం పాలనపై విమర్శలు కురిపిస్తూ ప్రజల్లోకి వెళ్తుంటే.. తాము చేసిన అభివృద్ది సంక్షేమా పథకాల గురించి వివరిస్తూ ప్రజలను ఆకర్శించే ప్రయత్నాలు చేస్తుంది అధికార పక్షం. ఇదిలా ఉంటే మొన్నటి వరకు ఏపీ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు అసహనంతో ఉన్నారు.. ఇప్పటికే పలుమార్లు పెద్ద ఎత్తున తమ నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్టు కనిపిస్తుంది ఏపీ సర్కార్. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతూ వస్తుంది. తాజాగా ఏపీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ వరుసగా శుభవార్తలు తెలియజేస్తుంది. తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త తెలిపారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు తాము కోరుకున్న చోట ప్లాట్ తీసుకోవచ్చు. గతంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ మాత్రమే కొనుగోలు చేసే సౌకర్యం ఉండేది. ఇటీవల ఉద్యోగులు విజ్ఞప్తుల మేరకు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ఈ నిబంధనలు సడలించి కొత్త జీవో నంబర్ 38 జారీ చేసింది. ఈ కొత్త జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో అయినా ప్లాట్ ను ఎంపిక చేసుకునే అవకాశం లభించింది.
ఇప్పటికే రాష్ట్రంలో 22 నగరాలు, పట్టణాల్లో పూర్తి సౌకర్యాలు, అనుమతులు, ప్రణాళికతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ డెవలెప్ మెంట్ చేసిశారు. అంతేకాదు వీటిని మార్కెట్ ధరకన్నా తక్కువే ధరకే అందుబాటులో ఉంచారు. ఇందులో ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొనుగోలు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో అన్ని లే అవుట్లలో ప్రభుత్ ఉద్యుగులకు 10 ప్లాట్లు రిజర్వ్ చేయడంతో పాటు ధరలో కూడా 20 శాతం రిబేట్ ఇచ్చేందుక సిద్దమైంది. ఈ అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. లేఅవుట్స్ వివరాల గురించి తెలుసుకోవాలంటే.. https:// migapdtcp. ap. gov. in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.