మారుతున్న కాలంతో పాటు సమాజంలో.. కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటే.. వింతగా చూసి.. చెవులు కొరుక్కునేవారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చాయి. ప్రస్తుత కాలంలో ఆడామగా స్నేహాలు సాధారణం అయ్యాయి. సమాజంలో ప్రేమ వివాహాలు కూడా పెరిగాయి. ఇక నేటి కాలంలో అయితే.. వ్యామోహాన్నే ప్రేమగా భావించి.. అడ్డమైన పనులు చేస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. పట్టుమని పదో తరగతి కూడా పూర్తి కాకముందే.. ప్రేమ అంటూ.. విచ్చలవిడిగా తిరగడం.. శారీరక సంబంధాలు పెట్టుకోవడం వంటి సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో.. పట్టపగలు.. బైక్ మీద మైనర్ ప్రేమ జంట.. ఎలాంటి వికృత చేష్టాలకు పాల్పడ్డారో ప్రత్యక్షంగా చూశాం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలయ్యింది.
విశాఖ జిల్లా గాజువాకలో.. ఈవికృత సంఘటన చోటు చేసుకుంది. గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్లో మైనర్లు.. అందునా స్కూల్ విద్యార్థిని.. నడిరోడ్డుపైనే బరితెగించారు. పట్టపగలు.. రోడ్డు మీద జనాలు చూస్తుండగా.. అది కూడా బైక్ మీద వెళ్తూ.. వికృత చేష్టలతో రెచ్చిపోయారు. డ్రైవ్ చేసే అబ్బాయికి ఎదురుగా.. పెట్రోల్ ట్యాంక్‌పై అమ్మాయి కూర్చుని.. అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఆ తర్వాత.. మనం చెప్పుకోలేని రేంజ్లో పాడు పనులు కొనసాగించారు. ఇక ఈ బైక్ వెనక ఓ ఫామిలీ కారులో వెళ్తుంది. వాళ్లు.. ఇదేం పని.. మీకు బుద్ది ఉందా అని చీవాట్లు పెట్టినా సరే.. ఏమాత్రం పట్టించుకోకుండా.. వారి పనిలో వాళ్లు ఉన్నారు.
ఈ క్రమంలో ఈ మైనర్ జంట వికృత చేష్టలను వీడియోలో బంధించి… సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇది తెగ వైరలయ్యింది. ఈ ఇద్దరిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే వయసులో ఈ పాడు పనులు ఏంటి.. మీ తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే.. గుండె పగిలి చస్తారు.. అని కామెంట్స్ చేశారు. పోలీసులు వీరికి తగిన విధంగా బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత ఏమైంది అంటే.. ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్ అన్నట్లు.. పోలీసులు ఈ జంటను అదుపులోకి తీసుకున్నారు. వీడియో వైరల్ కాగానే.. పోలీసులు వీరి కోసం గాలింపు మొదలు పెట్టారు. ఆ తర్వాత గాజువాక సమీపంలోని వెంపలినగర్, సమతానగర్‌కు చెందిన విద్యార్థినిని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి.. పలు సెక్షన్ల కింద వీరి మీద కేసు నమోదు చేశారు. గోప్యత కారణంగా అమ్మాయి వివరాలు వెల్లడించలేదు. మరి ఇలాంటి వారు మారాలంటే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారో.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.