ఈజీ మనీ కోసం ఈ మద్య చాలా మంది ఎలాంటి అక్రమాలకైనా పాల్పపడుతున్నారు. మంచి హూదాలో ఉన్నవారైనా డబ్బు తప్పడు పనులు చేయిస్తుందని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి.
ఈ మద్య కాలంలో కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పపడుతున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్స్ లో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. చాలా మంది ఆన్ లైన్ బెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటే.. కొంతమంది మాత్రం దొంగలుగా మారి ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఓ బ్యాంక్ ఉద్యోగి ఆన్ లైన్ బెట్టింగ్ లో మోసపోయి దొంగగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పీనారిపాలేం కి చెందిన చిటికెల నాగేశ్వరరావు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నర్సిపూడి, గొల్లప్రోలు, ఏలేశ్వరం, నిడమర్రు, సోమవరం, కిర్లంపూడి మండలాల్లో ఓ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేశాడు. కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ లకు పాల్పపడుతూ డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చే క్రమంలో చేస్తున్న బ్యాంక్ లోనే లాకర్ లో ఉన్న బంగారం చోరీ చేసి అమ్ముకున్నాడు. ఈ క్రమంలో నాగేశ్వరరావు ని బ్యాంక్ అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి నాగేశ్వరరావు డబ్బు అవసరాలు తీర్చుకోవడానికి చిన్న చిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
గతంలో సంవత్సరం పాటు అద్దకు ఉన్న ప్రాంతంలోని పలు ఇళ్లల్లో దొంగతనం చేయడానికి స్కెచ్ వేశాడు నాగేశ్వరరావు. ఈ క్రమంలోనే మే 12న అర్థరాత్రి సమయంలో అన్నవరంలోని సత్యదేవా జూనియర్ కాలేజ్ వెనుక ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జి. వీరభద్రరావు ఇంటి తాళాలు పగలగొట్టి 33.8 కాసుల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి వస్తువుల, నగదు 50 వేల రూపాలు దొంగతనం చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాగేశ్వరరావుని పట్టుకొని అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఏలేశ్వరంలోని ఏటీఎంలో రూ.2.34 లక్షలు కాజేసి జైలుపాలయ్యాడు.. ఈ మద్యనే బెయిల్ పై వచ్చి మరోసారి దొంగతనం చేసి పోలీసులకు చిక్కిపోయాడు.