చిన్న పిల్లలు తెలిసీ తెలియక బోరు బావిలో పడి మరణించిన సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. ఈ ఘటనలు ఎక్కువగా గ్రామాల్లో జరుగుతుంటాయి. ఇలా బోరు బావిలో చిన్నారులు పడ్డ సంఘటనలన్నీ చివరికి విషాదంగా మారినవే ఎక్కువ. తాజాగా ఓ 9 ఏళ్ల బాలుడు బోరు బావిలో పడి అదృష్టం కొద్ది ప్రాణాలతో బయట పడ్డాడు.. దాంతో తల్లిదండ్రులు, గ్రాస్థులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుకుంట కు చెందిన తొమ్మిది ఏళ్ళ పూర్ణ జశ్వంత్ తన ఇంటి సమీపంలో ఒంటరిగా ఆడుకుంటున్నాడు. అక్కడ కొంతకాలంగా పూడుకు పోయి ఉన్న 400 అడుగుల లోతు ఉన్న ఓ పాత బోరు బాయి ఉంది. ఇటీవల భారీ వర్షాలు కురియడంతో చెత్తా చెదారం పేరుకు పోయి ఆ బోరు బావి రంద్రం కనిపించకుండా పోయింది. ఇది తెలియని జశ్వంత్ అటుగా వెళ్లి బోరుబావిలో పడిపోయాడు.
చీకటి పడ్డా కూడా తమ కొడుకు జశ్వంత్ ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డా అతని తల్లిదండ్రులు అందరినీ అడిగారు.. మొత్తం వెతికారు. కానీ తమ కుమారుడి జాడ తెలియకపోవడంతో భయపడిపోయారు. అయితే రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో బోరు బావి నుంచి కొన్ని శబ్ధాలు వినిపిస్తున్నాయని స్థానికులు తెలపడంతో వెంటనే బోరుబావి వద్దకు వెళ్లి తాళ్ళ సహాయంతో బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ వారు పడ్డ శ్రమ వృధా అయ్యింది. ఆ సమయంలో సురేష్ అని యువకుడు ఎంతో దైర్యం చేసి తన నడుముకు తాడు కట్టుకొని బోరుబావిలో దిగి బాలుడి నడుముకి ఆ తాడు కట్టి పైకి లాగాడు.
మొత్తానికి సరేష్ చేసిన సాహసంతో జశ్వంత్ సురక్షితంగా బయట పడ్డాడు. దాంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న భీమడోలు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని బాలుని క్షేమ సమాచారం గురించి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు బోరు బావిలో నరకం చూసి.. జశ్వంత్ ప్రాణాలతో బయటపడటంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) July 7, 2022
— Hardin (@hardintessa143) July 7, 2022