మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఎం.వి. శేషగిరిబాబు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర జనరల్ లో 35 శాతం, ఒకేషనల్ లో 42 శాతం మంది పాస్ అయ్యారు. అదే విధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫలితాలను https://bie.ap.gov.in/ లో చూసుకోవచ్చు.