ప్రతి మనిషి తమ వైవాహిక జీవితంలో తమకంటూ ఓ కొడుకో, కూతురో కావాలని కోరుకుంటారు. తల్లిదండ్రులుగా మారి కొత్త బాధ్యతలు తీసుకోవాలని ఉవిళ్లూరుతారు. అమ్మా, నాన్న అని పిలిపించుకోవాలని కలలుగంటారు. కానీ, కొందరి జీవితాల్లో అవి కలలుగానే మిగిలిపోతుంటాయి. సంతానం అనేది వారి జీవితంలో ఓ కలగానే మిగిలిపోతూ ఉంటుంది. కానీ, ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ లాంటి వారి కృషితో అలాంటి ఎంతో మంది జీవితాల్లో నవ్వులు పూశాయి.
మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనిషుల్లో సంతానలేమికి ముఖ్యకారణాలుగా వైద్యులు చెబుతుంటారు. కొందరికి ఆ సమస్య మందులు, వ్యాయామం, ఆహారపు అలవాట్లతో తీరిపోవచ్చు. కానీ, కొందరికి మాత్రం కచ్చితంగా ట్రీట్‌మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి పద్ధతులను ఫాలో అవ్వాలో తెలియకపోవచ్చు.
దంపతులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటేనే సంతానం కలుగుతుంది. ఒక్కోసారి సమస్య స్త్రీలో ఉండచ్చు.. ఒక్కోసారి పురుషుడిలో ఉండచ్చు. ఒకవేళ పురుషులలో కనుక వీర్య కణాల కౌంట్, వేగం, ఆరోగ్యమైన వీర్యకణాలు తగ్గటం వంటి సమస్యలు ఉంటే.. అలాంటి వారికి ఐసీఎస్‌ఐ అనే విధానాన్ని రికమెండ్ చేస్తారు. ఇది కూడా ఐవీఎఫ్ విధానానికి బాగా దగ్గరగా ఉంటుంది.
పురుషుడిలో వీర్య కణాల సంఖ్య, వేగం తక్కువగా ఉండటం వంటి సమస్యలతో సంతానం కలగని వారికి ఈ విధానం ద్వారా పిల్లలు పుట్టేలా చేస్తారు. ఈ విధానంలో భర్త నుంచి సేకరించిన ఆరోగ్యవంతమైన వీర్యకణాన్ని భార్య అండంలో ప్రవేశ పెడతారు. ఈ విధానం ఇంచుమించు ఐవీఎఫ్ విధానానికి దగ్గరగా ఉంటుంది. దీనినే ఇంట్రాసైటో ప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ఐసీఎస్‌ఐ) అంటారు.
ముందుగా భర్తతోపాటు భార్యకు సంబంధించిన మెడికల్ హిస్టరీని పరిశీలిస్తారు. ఈ విధానంలో ముందు పురుషుడిలోని వీర్య కణాల సంఖ్య, వాటి వేగం, ఆరోగ్యంగా ఉన్నాయా అనేది పరీక్షిస్తారు. ఆ తర్వాత భర్త నుంచి వీర్యం కలెక్ట్ చేస్తారు. అందులోంచి ఆరోగ్యవంతమైన, వేగంగా ఉండే ఒక వీర్య కణాన్ని తీసుకుని భార్య నుంచి సేకరించిన అండంలో ప్రవేశ పెడతారు. ఆ తర్వాత ఐదు రోజుల తర్వాత స్త్రీ గర్భాశయంలో ఆ అండాన్ని ఉంచుతారు.
హైదరాబాద్ లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎందరో సంతానలేమితో బాధపడుతున్న వారి జీవితాల్లో ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ వారు వెలుగులు నింపారు. అంతేకాకుండా హైదరాబాద్ లోనే ఎంతో అధునాతన ల్యాబ్ వీరి ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఐసీఎస్‌ఐ విధానంలో ఎంతోమందికి సంతానం కలిగేలా చేశారు.
కనుక మీలో ఎవరైనా సంతానలేమితో బాధపడుతున్నా.. ఐసీఎస్‌ఐ విధానం ద్వారా పిల్లల్ని కనాలని ఎదురుచూస్తున్నా.. ఎలాంటి భయం, బిడియం లేకుండా ఫెర్టీ9ని సందర్శించి.. మీ సంతానలేమి సమస్యకి పరిష్కారాన్ని పొందండి. చక్కని పిల్లల్ని కని.. ఆనందంగా జీవించండి. మరిన్ని వివరాల కోసం 93905 01598 ఈ నెంబర్ ను సంప్రదించండి.