ఫేస్‌బుక్‌ డౌన్‌ అవ్వడం టెలిగ్రామ్‌కు కలిసొచ్చిందిగా..

markjukerburg facebook telegram

సోమవారం రాత్రి ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పనిచేయక చాలా మంది ఇబ్బంది పడ్డారు. దాదాపు 6 గంటల పాటు ఈ మూడు యాప్‌ల సర్వీస్‌లు డౌన్‌ అవ్వడంతో వీటికి పోటీ యాప్‌గా ఉన్న టెలిగ్రామ్‌కు బాగా కలిసొచ్చింది. దాదాపు 70 మిలియన్ల మంది కొత్తగా టెలిగ్రామ్‌ యూజర్లుగా జాయిన్‌ అయ్యారు. టెలిగ్రామ్‌కు ఇది పెద్ద విషయం. 6 గంటలు తమ ఫోన్‌లలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా పనిచేయకపోవడంతో చాలా మంది టెలిగ్రామ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు.

అంతకంటే ముందు కూడా టెలిగ్రామ్‌ యూజర్లు అధిక సంఖ్యలోనే ఉన్నా ఇంతభారీగా ఒకే సారి యూజర్లు యాడ్‌ అవ్వడం ఇదే మొదటిసారి. వాట్సప్‌తో పోల్చుకుంటే టెలిగ్రామ్‌ యూజర్ల సంఖ్య చాలా తక్కువ. సాంకేతిక సమస్య కారణంగా తమ యాప్‌ సర్వీస్‌లు నిలిచిపోయినట్లు ఫేస్‌బుక్‌ కంపెనీ సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తెలిపి, అపాలజీ కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఈ సర్వీస్‌ డౌన్‌ కారణంగా జుకర్‌బర్గ్‌కు దాదాపు రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లింది.