భారత్‌లో 5జీ సేవలు.. గ్రామీణ ప్రాంతంలో 5జీ ట్రయల్స్‌!

టెలికాం రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇప్పటివరకు 4జీతో పరుగులు పెట్టిన ఇండియా త్వరల 5జీతో పరుగులు పెట్టనుంది. దేశంలో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా 5 జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌, ఎరిక్సన్‌తో కలిసి దేశంలో తొలిసారి గ్రామీణ ప్రాంతంలో 5జీ ట్రయల్స్‌ నిర్వహించింది.

gagh minఈ నేపథ్యంలో టెలికామ్ శాఖ ఎయిర్‌టెల్‌కు కేటాయించిన 5జీ ట్రయల్ స్పెక్ట్రమ్ ద్వారా దిల్లీ-ఎన్‌సీఆర్‌ శివార్లలోని భైపూర్ బ్రమనన్ గ్రామంలో ఈ ట్రయల్స్‌ జరిపాయి. ఈ ట్రయల్స్ మంచి విజయం సాధించినట్లు తెలిపారు. సైట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3జీపీపీ-కంప్లైంట్ 5జీ ఎఫ్‌డబ్ల్యుఎ పరికరంలో 200కి పైగా ఎంబిపిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. 3500మెగాహెర్ట్జ్ బ్యాండ్, ఇప్పటికే ఉన్న ఎఫ్‌డిడి స్పెక్ట్రమ్ బ్యాండ్ ద్వారా ఈ ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ ట్రయిల్స్‌లో భాగంగా ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది.

sdgvagad minఈ ట్రయల్స్ లో 1 జీబీపీఎస్‌ వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. ఎన్‌ఎస్‌ఏ (నాన్-స్టాండ్ అలోన్) నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌లో హైదరాబాద్ నగరంలో వాణిజ్య నెట్‌వర్క్ ద్వారా లైవ్ 5జీ సేవలను విజయవంతంగా పరీక్షించిన మొదటి టెల్కోగా ఎయిర్‌టెల్ నిలిచింది. మొత్తానికి భౌగోళికంగా మారుమూల ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ కవరేజీని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు టెలికామ్ మేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.