రోబోటిక్ సాయంతో మ‌నిషికి మూడో క‌న్ను!

ఫ్యూచర్‌లో ఎన్నో అద్భుతాలు చేయగల సత్తా రోబోటిక్స్‌ కి ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. ఆ పరంపరలో వచ్చిన మరొక ఆవిష్కరణ ‘థర్డ్‌ ఐ’. స్మార్ట్ ఫోన్ జాంబీస్‌!. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లోకాన్ని మ‌రిచిపోతుంటారు. చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతున్నా ప‌ట్టించుకోరు. ద‌క్షిణ కొరియాకు చెందిన పేంగ్ మిన్ వూక్’ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఇంపీరియల్ కాలేజీలో ఇన్నోవేషన్ డిజైన్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. స్మార్ట్ వినియోగ‌దారులు రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. అలాంటి వారి ప్రాణాల్ని ర‌క్షించేందుకు రోబోటిక్ టెక్నాల‌జీని ఉప‌యోగించి మ‌నిషి చూసేందుకు మూడో క‌న్నును త‌యారు చేశాడు.

shibuya12 0

“ఫోనో సేపియన్స్ అని పిలిచే థ‌ర్డ్ ఐను నుదిటిపై పెట్టుకునేలా డిజైన్ చేశాడు. ఈ ‘థ‌ర్డ్ ఐ’ రోడ్డు ప్ర‌యాణాల్లో, లేదంటే న‌డిచే స‌మ‌యంలో ఫోన్ బ్రౌజ్ చేసే స‌మ‌యంలో అలెర్ట్ చేస్తోంది. ప‌రిస‌రాల్ని గ‌మ‌నించ‌డం లేద‌ని అనిపిస్తే సిగ్న‌ల్ ఇస్తోంది. ఒకటి నుండి రెండు మీటర్ల లోపు రోబోయే ప్ర‌మాదాల్ని హెచ్చ‌రిస్తూ బీప్ సౌండ్ చేస్తోంది. ప్ర‌స్తుతం పేంగ్ మిన్ వూక్ త‌యారు చేసిన ఈ థ‌ర్డ్ ఐ సియోల్ న‌గ‌రంలో చ‌ర్చాంశ‌నీయంగా మారింది. ఇప్పుడు ఈ ఫోనో సేపియ‌న్స్ కు కెమెరా మాడ్యూల్తో లింక్డ్ మొబైల్ ఫోన్ యాప్ ను డెవ‌ల‌ప్ చేయాలని యోచిస్తున్న‌ట్లు రాయిట‌ర్స్ కు తెలిపాడు. వీధుల్లో వెళ్లే స‌మ‌యంలో చేతిలో స్మార్ట్ ఫోన్ తో ప‌రిస‌రాల్ని మ‌రిచిపోయే వాళ్ళకు ఈ థ‌ర్డ్ ఐ ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితం.