ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు ‘ఆటో షటిల్’ …అందుబాటులోకి!.

తొలిసారి డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌‌‌‌‌ పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ బ్రిటన్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులోకి వచ్చింది. దాదాపు పదేండ్లుగా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చేశాయి. అయితే రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో సెల్ఫ్ డ్రైవింగ్ బస్‌‌‌‌‌‌‌‌ టెస్ట్ రన్ నిర్వహించగా సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జర్నీ పూర్తయింది. ‘అరిగో’ కంపెనీ తయారు చేసిన ఈ బస్సులు త్వరలోనే పబ్లిక్‌‌‌‌‌‌‌‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. అరిగో కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులకు ‘ఆటో షటిల్’ అని పేరు పెట్టారు.

180626133902 trapizio self driving electric bus tease super tease

ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మూడు బస్సులను మొదటగా మ్యాంగ్లే రోడ్ పార్క్ – కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మధ్య నడిపించాలని ఆ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫస్ట్ ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. మూడు కిలోమీటర్ల రూట్‌‌‌‌‌‌‌‌లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్ మధ్య దీనిని నడిపారు. ఈ ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌లో ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ గానీ, ఇతర వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టడం గానీ లేకుండా ప్రయాణం పూర్తి కావడంతో కేంబ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌ ఇతర రీసెర్చ్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లతో పాటు రైల్వే స్టేషన్లు, పార్కులు వంటి వాటికి సర్వీసులు నడిపిస్తామని అరిగో కంపెనీ తెలిపింది. అయితే జర్నీని ప్రస్తుతానికి ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్స్‌‌‌‌‌‌‌‌గానే పరిగణిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. త్వరలోనే యూకేలోని మరిన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తామని తెలిపారు.