Ola Electric Scooter: క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 'ఓలా ఎస్1' పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.99,999లుగా నిర్ణయించింది. గతేడాది లాంచ్ అయిన ఎస్1 ప్రో టెక్నాలజీతోనే దీన్ని కూడా రూపొందించారు. ఈ కొత్త స్కూటీ 131 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓలా ఎస్1 ప్రో మోడల్ని రిలీజ్ చేసింది కంపెనీ. ప్రారంభ ఆఫర్ కింద ప్రస్తుతానికి దీని ధరను రూ.99,999గా(ఎక్స్-షోరూం) నిర్ణయించారు. రూ.499 చెల్లించి ఈ స్కూటీని బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రెడ్, జెట్ బ్లాక్, పోర్స్‌లెయిన్ వైట్, నియో మింట్, లిక్విడ్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. Up to 131 KM range, Rs. 99,999 introductory price Here are the colour options of Ola S1 electric scooter pic.twitter.com/ksDc5LB3qt — Tirumalasetty Tirupathirao (@tiru9676) August 15, 2022 ఓలా ఎస్1 ఫీచర్స్: ఇందులో ఆపరేటింగ్ సిస్టంను కూడా అందించారు. మూవ్ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై స్కూటీపై ఫోన్ పనిచేయనుంది. 7 అంగుళాల టచ్ స్క్రీమ్, 8కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, బ్లూటూత్, వైఫై, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓలా ఎస్1 ప్రో తరహాలో మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫంక్షనాలిటీ ఇందులో కూడా ఉంది. సపోర్ట్ చేసే యాప్ ద్వారా చార్జ్ స్టేటస్, ఓడో మీటర్ రీడింగ్ వంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. దీపావళి నాటికి మూవ్ఓఎస్ 3.0 అప్డేట్ను కూడా అందిస్తామని ఓలా తెలిపింది. ఆసక్తి గల వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, లోన్స్, క్యాష్ ద్వారా ఈ కొత్త స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ఈఎంఐలు రూ.2,999 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మార్ష్‌మెల్లో, నియో మింట్, పోర్సిలైన్ వైట్, కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, మ్యాట్ బ్లాక్, అంత్రసైట్ గ్రే, గెరువా కలర్ ఆప్షన్స్‌లో ఓలా ఎస్1 ప్రో లభిస్తోంది. ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,49,999. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Apollo RT6: ‘సెల్ఫ్ డ్రైవింగ్ కారు’ను ఆవిష్కరించిన బైడూ.. ధర కూడా అందుబాటులోనే.. ఇదీ చదవండి: పండగ ఆఫర్లు: కార్లపై డిస్కౌంట్లు ప్రకటించిన పలు ప్రముఖ కంపెనీలు!