Moto X30 Pro: స్మార్ట్ ఫోన్లు వచ్చాక వేలు, లక్షలు పెట్టి కెమెరాలు కొనే పరిస్థితి తప్పింది. ఖరీదైన కెమెరాతో తీస్తే వచ్చే ఫోటోలు ఎంత క్వాలిటీగా, క్లారిటీగా ఉంటాయో.. అంతే క్వాలిటీ, క్లారిటీతో ఉన్న ఫోటోలని స్మార్ట్ ఫోన్లో ఉన్న చిన్న కెమెరా కూడా ఇస్తుంది. దీంతో కస్టమర్లు కూడా స్మార్ట్ ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఫోటోలేం కర్మ.. ఏకంగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీసేస్తున్నారు. ఒకప్పుడు ఫోన్ అంటే.. 2 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ కెమెరాలు ఉండేవి. అప్పట్లో 10 మెగా పిక్సల్ కెమెరా అంటే ఓ మై గాడ్ అనేవారు. మరి ఇప్పుడు 50 మెగా పిక్సల్ కెమెరా సర్వ సాధారణమైపోయింది. కస్టమర్లని ఆకర్శించడానికి ఫోన్ల కంపెనీలు కెమెరా పిక్సల్ సైజుని పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా మోటోరోలా ఏకంగా 200 మెగా పిక్సల్ సెన్సర్‌లో ఓ ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 'మోటో ఎక్స్ 30 ప్రో' మోడల్ నేమ్‌తో దీన్ని తీసుకురానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను మోటోరోలా అధికారికంగా వెల్లడించగా.. కొన్ని స్పెసిఫికేషన్లు సోషల్ మీడియాలో లీకయ్యాయి. స్నాప్ డ్రాగన్ 8+ జన్1 ప్రాసెసర్‌తో ఈ 'ఎక్స్ 30 ప్రో' వస్తున్నట్లు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ ఫోన్లో 8 నుండి 12జిబి ర్యామ్ కెపాసిటీ, అలానే 128 నుండి 256జిబి స్టోరేజ్ కెపాసిటీతో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. Moto X30 Pro official renders.#motorolax30pro pic.twitter.com/SR12pm6hP8 — Ankush Vishwakarma (@ankushtechy) July 29, 2022 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్ రానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. 6.67 ఇంచెస్‌లో ఫుల్‌హెచ్‌డి, ఓఎల్ఈడీ డిస్ప్లేలతో, 144 హెర్ట్జెస్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుందని సమాచారం. ఇక ఈ ఫోన్‌ను ఆగస్ట్ 2న చైనాలో లాంఛ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌లో కూడా త్వరలోనే లాంఛ్ చేయనుందని సమాచారం. కాగా 200 మెగాపిక్సల్ కెమెరాతో వస్తున్న తొలి ఫోన్ కావడంతో ఈ ఫోన్ టెక్కీల దృష్టిని ఆకర్శిస్తోంది. 12 మెగాపిక్సల్ కెమెరా ఉన్న ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్‌తోనే మూవీలు చేయగా లేనిది.. ఈ 200 మెగాపిక్సల్ కెమెరా ఫోన్‌తో మూవీలు చేయలేమా అని నెటిజన్లు అంటున్నారు. పైగా ఐఫోన్ కంటే తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉండవచ్చునని కామెంట్లు చేస్తున్నారు. మరి దీని ధర ఎంత ఉంటుంది? ఎప్పుడు భారత్ మార్కెట్లోకి వస్తుంది అనే వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: భారత్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓ.. ఏడాదికి రూ.123 కోట్లా? ఇది కూడా చదవండి: Palm Oil: పెట్రో కష్టాలు.. ఇక పామాయిల్‌తో పరుగులు పెట్టనున్న వాహనాలు!