‘ఐఫోన్‌-13’ రిలీజ్‌కు ముందే లీకులు.. కలర్లు, కొత్త ఫీచర్లు ఇవే!

iphone13

సెప్టెంబర్‌ 14న తన కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు టెక్‌ దిగ్గజం యాపిల్‌ సన్నాహాలు చేస్తోంది. ఈలోపు వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. ఉక్రేయిన్‌కు చెందిన ఓ రీటైలర్‌ రాబోతున్న ఐఫోన్‌ 13 కలర్లు, వేరియంట్లు మొత్తం వివరాలు పూర్తి సమాచారాన్ని లీక్‌ చేశాడు. లీకుల వివరాల ప్రకారం ఐఫోన్‌ మినీ, ఐఫోన్‌ 13 మొత్తం ఆరు రంగుల్లో విపణిలోకి అడుగు పెట్టబోతున్నాయి. నలుపు, నీలం, పింక్‌, ఊద, తెలుపు, ఎరుపు రంగుల్లో వచ్చే అవకాశం ఉంది.

iphone13 new modelమినీ 64 జీబీ, 128 జీబీ వేరియంట్లలో అందుబాటులోకి రానుందని సమాచారం. ‘ఐఫోన్‌ 13’ 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్‌ 13ప్రో, ప్రో మ్యాక్స్‌ నాలుగు రంగుల్లో అందుబాటులోకి వస్తుందని ఉక్రేనియన్‌ లీక్‌ చేశాడు. అవి నలుపు, సిల్వర్‌, గోల్డ్‌, బ్రాంజ్‌ రంగుల్లో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్‌ 13 ప్రో 128 జీబీ గానీ, 256 జీబీ స్టోరేజ్‌తో గానీ రావొచ్చు. ఐఫోన్‌ 13 ప్రోమ్యాక్స్‌ 256 జీబీ స్టోరేజ్‌తో గానీ, 512 జీబీ స్టోరేజ్‌తో కానీ రావొచ్చని తెలుస్తోంది.

ఐఫోన్‌ 13 సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేవారం తెలుస్తాయి.  అదే కార్యక్రంలో కొత్తగా మరో యాపిల్‌ వాచ్‌ను కూడా విడుదల చేస్తారని సమాచారం.