ఐఫోన్‌13తో కంటి చికిత్స.. డాక్టర్ పై ప్రశంసలు!

ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగానో పెరిగిపోయింది. టెక్నాలజీ మార్పులతో వైద్య చరిత్రలో ఎన్నో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. కానీ ఓ డాక్టర్ మాత్రం వైద్య చరిత్రలో ఓ అద్భుతాన్ని సృష్టించాడు.మన శరీరభాగాల్లో అని సున్నితమైన కంటికి యాపిల్‌ ఐఫోన్‌13తో వైద్యం చేస్తున్నాడు. కంటి చూపును మెరుగు పరిచటానికి ఐఫోన్ తో అద్భుతాలు చేస్తున్నారు ‘టామీ కార్న్’ అనే డాక్టర్. ఫోన్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ టెక్నాలజీని ఉపయోగించి కంటిచూపు సమస్యలను ఐఫోన్‌తో పరిష్కరిస‍్తున్నారు.

sdgasg min 1ఇది వినటానికి వింతగా అనిపించినా.. ఆ వైద్యుని వద్ద ఈ ఐఫోన్ చికిత్స తీసుకున్న పేషెంట్లు కూడా తమ చూపు మెరుగైందని చెప్పుకొస్తున్నారు. డాక్టర్ టామీ కార్న్ చేస్తున్న వైద్యం.. ఇదొక మెడికల్‌ మిరాకిల్‌ అని అంటున్నారు. డాక్టర్ టామీ కార్న్ విషయానికి వస్తే.. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందినవారు.. ఈయన ఆప్తమాలజిస్ట్. గత 21 ఏళ్లుగా కంటి వైద్యుడిగా ఎంతోమంది పేషెంట్లు కంటిచూపు మెరుగుపర్చారు. ఈక్రమంలో డాక్టర్ టామీ కార్న్ ఐఫోన్‌13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి ‘ఐ’ ట్రీట్మెంట్‌ చేస్తు పలువురు పేషెంట్లకు కంటిచూపుని అందించటంలతో పాటు పలువురు నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్‌ ఉన్నా.. మ్యాక్రోమోడ్‌ అనేది వెరీ స్పెషల్.

fasge min 1దీంట్లో భాగంగా ఫన్ ఎగ్జాంపుల్.. కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని కూడా ఈ అడ్వాన్స్‌డ్‌ మ్యాక్రోమోడ్‌ టెక్నాలజీతో హెచ్‌డీ క్వాలిటీ ఫోటోలను తీయవచ్చు. ఇప్పుడు అదే చేస్తున్నారు డాక్టర్ టామీ కార్న్.. దీని ద్వారా పేషెంట్స్ సమస్య తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్ మెంట్ చేస్తున్నారు. కాగా, ఓ పేషెంట్‌కు అందించిన ట్రీట్మెంట్‌ విధానాన్ని డాక్టర్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయటంతో దానికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. భలే ఉందే ‘ఐ’ఫోన్ తో ఐ ట్రీట్ మెంట్ అంటున్నారు.