హైదరాబాద్: ప్రయాణీకుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయాన్ని తీసుకుంది. టికెట్ తో పాటు తాగు నీరు అందించేలా మంచి నీళ్ల బాటిళ్లను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ‘జీవా’ పేరుతో ప్రారంభించబోతున్న ఈ సేవ సోమవారం నుండి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీ టికెట్ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. తెలంగాణాలోని ప్రతి బస్సు ప్రాంగణాల్లో కూడా ఇవి లభిస్తాయని టీఎస్ఆర్టీసీ ఎండీ […]