ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలో వరుడు తుపాకీ చేతిలోకి తీసుకుని ఫైర్ చేశాడు. అది కాస్త అక్కడే నిలబడి ఉన్న యువకుడికి తగిలింది. వెంటనే గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యం చేస్తుండగానే చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్ ప్రాంతంలో మనీష్ మాద్హేశియా అనే పెళ్లి కుమారుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. […]