అప్పుల బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ఓ దంపతులు ఓ సెల్ఫీ వీడియోను వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. కట్ చేస్తే.. ఏలేరు నదిలో ఇద్దరి మృతదేహాలు పైకి తేలడంతో ఖచ్చితంగా అవి వరప్రసాద్, మీరా దంపతులవేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
మా కొడుకు, కూతురుని జాగ్రత్తగా చూసుకోండి. మేము మీకు డబ్బులు ఇవ్వలేదని వారిని ఏం అనొద్దు. మా అత్తను, అమ్మను బాగా చూసుకోండి. ఎవరూ ఏమన్న పట్టించుకోవద్దు. ఇక మేము వెళ్లిపోతున్నాం అంటూ ఓ దంపతులు ఏడుస్తూ చివరి సారిగా తీసుకున్న సెల్ఫీ వీడియోలో మాటలు ఇవి. అసలు ఏం జరిగిందంటే?