చెన్నై- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పదవీభాద్యతలు తీసుకోగానే పాలనాపరమైన నిర్ణయాలు వడివడిగా తీసుకుంటున్నారు. సీఎం పదవి చేపట్టగానే ప్రజా సంక్షేమ పధకాలకు సంబందించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇక రాష్ట్రంలో పోలీస్ శాఖ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన స్టాలిన్ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీ కందస్వామిని నియమించారు. ఇప్పుడు కందస్వామి నియామకం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎందుకంటే పీ కందస్వామికి 2010లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను అరెస్ట్ చేశారు. […]