ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోయి వస్తున్నాయి. కారణాలు ఏవైనా కావొచ్చు తాము ఎంతగానో అభిమానించే నటీ, నటులు ఆత్మహత్యలకు పాల్పపడటం కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తన గాత్రంతో ఎంతో అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సింగర్ సునీత. అటు సింగర్ కానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తన పంథాను కొనసాగిస్తోంది. ఎన్నో సుపర్ హిట్ సినిమాలకు పని చేసిన ఆమె ఇప్పటికీ 500 పైగా సినిమాల్లో డబ్బింగ్ చెప్పి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక ఇటు సింగర్‌గా కూడా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుని ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న సింగర్‌గా వెలుగొందుతోంది […]