ఏపీలో కేసీఆర్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏపీకి వస్తే ఘన స్వాగతం పలికే అభిమానులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారిన క్రమంలో పార్టీకి ఏపీలో అడుగుపెట్టేందుకు సరైన అవకాశం దొరికింది. త్వరలోనే ఏపీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. సభ ఎక్కడుంటుంది అంటే?
భారత రాష్ట్ర (బీఆర్ఎస్) ఈ నెల 18న (బుధవారం) ఖమ్మంలో జరుపుతున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత చేపడుతున్న తొలి బహిరంగ సభ నేపథ్యంలో గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో భారీగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో పాటు జాతీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్నారు. […]
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్ నేడు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల నరసాపురంలో ఒకేసారి రూ.3,300 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని.. త్వరలో నరసాపురం రూపు రేఖలు మారిపోతాయని అన్నారు. నరసాపురంలో ఆక్వా వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు చేస్తున్నామని.. పేదల […]
బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన స్వంత గ్రామంలోనే చేదు అనుభవం ఎదురైంది… కొంత మంది యువకులు ఆయనపై దాడి చేశారు. ఆదివారం సీఎం నితీశ్ కుమార్ ఆయన సొంత ఊరు అయిన భకిత్యాపూర్ కి వచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన యోధుడు షిల్ భద్రయాజీ విగ్రహన్ని ఆవిష్కరించేందుకు విచ్చేశారు. అయితే నితీష్ విగ్రహం ముందు నివాళీ అర్పిస్తున్న సమయంలో ఓ యువకుడు భద్రతా సిబ్బందిని దాటుకొని ఆయనపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బందిని ఆ […]