రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ టూర్‌లో అదరగొడుతున్న టీమిండియాకు మరో కొత్త కోచ్ వచ్చాడు. గతంలో టీమిండియాకు కోచ్‌గా పనిచేసిన గ్యారీ క్రిస్టన్‌కు అసిస్టెంట్‌గా పనిచేసిన పడ్డి అప్టన్‌ను మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. సౌతాఫ్రికాకు చెందిన అప్టన్ 2008 నుంచి 2009 వరకు టీమిండియాకు సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే టీమిండియా ధోని కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది. ఆ తర్వాత గ్యారీ క్రిస్టన్‌తో పాటు సౌతాఫ్రికా జట్టుకు […]