సినిమా షూటింగ్స్ అంత ఈజీ కాదు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కత్తిమీద సామే. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ. ఇప్పుడో స్టార్ హీరో సెట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
హీరో విశాల్.. కోలీవుడ్లోనే కాదు అటు టాలీవుడ్లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. విశాల్ వ్యక్తిత్వానికి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరో హోదా పొందిన తర్వాత కూడా విశాల్ ఎంతో హుందాగా సాధారణ వ్యక్తిగా వ్యవహిస్తుంటాడు. తన సంపాదన నుంచి కూడా ఎంతో కొంత విరాళం, సామాజిక సేవకు ఉపయోగిస్తూ ఉంటాడు. అందుకే విశాల్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. […]