బలగం సినిమాతో కావ్య కల్యాణ్‌రామ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పొట్టి పిల్ల అంటూ కుర్రాళ్లు సాంగులు కూడా పాడేసుకుంటున్నారు. తాజాగా, ఆమె కొన్ని బోల్డ్ కామెంట్లు చేశారు.
ఒకే ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు హీరోయిన్ కావ్యా కల్యాణ్‌రామ్. ‘బలగం’లో పక్కింటి అమ్మాయి పాత్రలో భావోద్వేగాలను చక్కగా పలకరించి అందరి దృష్టిలో పడ్డారు.
టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో హీరోయిన్స్ ఉన్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి గొప్ప హీరోయిన్స్ అయినవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి కావ్యా కల్యాణ్ రామ్ చేరిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రెండు బిగ్ హిట్లు అందుకుంది. మూడో హిట్టు కోసం కూడా రెడీ అయిపోతోంది.
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్లుగా, హీరోలుగా ఎదిగినవారు ఉన్నారు. ఇంకొందరు చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత చదువు మీద శ్రద్ధతో ఇండస్ట్రీని వీడిన వారు కూడా ఉన్నారు. ఆ కోవకు చెందిన వారిలో అల్లు అర్జున్ గంగోత్రీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కల్యాణ్ రామ్ కూడా ఒకరు. ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా’ అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎంతో మంది అభిమానులను కూడా సొంతం […]