పాక్ లో దుర్భర పరిస్థితులు. చికెన్ నుంచి పాల వరకు.. పిండి నుంచి ఉల్లిపాయల వరకు అన్ని రకాల వస్తువుల రేట్లు వందలు, వేలల్లోనే.. కొద్దిరోజుల కిందట లైవ్ బ్రాయిలర్ చికెన్ రేటు వరకు కిలోకు రూ.370గా ఉండగా.. ఇప్పుడది రూ.800పైకి చేరిందంటేనే అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.
పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకీ మరింతగా దిగజారుతోంది. ఆహార, ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశంలో చివరకు రొట్టెపిండి దొరకడం కూడా కష్టంగా మారింది. పాక్‌లోని పలు మార్కెట్లలో గోధుమ పిండి కోసం జనం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు. గోధుమ పిండి కోసం పఖ్తున్‌ఖ్వా, సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లోని అనేక ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరగడం తెలిసిందే. ఈ విషయాన్ని అటుంచితే.. పాకిస్థాన్‌లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పలుచోట్ల విద్యుత్ లేదని […]
ఏ దేశమైనా తమ పరిస్థితులకు తగినట్లు ఆర్థిక వ్యవస్థను నడిపించుకోవాలి. దేశ పరిస్థితులకు అనుగుణంగా దేశాభివృద్ధి, ఇతర ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. అలాకాకుండా ఇష్టానురీతిగా ఖర్చులు చేస్తే.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకోక తప్పదు. కొన్ని సార్లు ప్రభుత్వాలు తీసుకుని అనాలోచితన నిర్ణయాల కారణంగా కూడా దేశాలు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంటాయి. మనకు పొరుగున ఉన్న శ్రీలంకానే అందుకు ఉదాహరణ. అక్కడ స్థాయికి మించి అప్పులు చేయడం, ఇతర కారణలతో తీవ్రస్థాయిలో ఆర్ధిక […]