పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్పకి సీక్వెల్ గా 'పుష్ప 2' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైజాగ్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న బన్నీ.. తదుపరి షెడ్యూల్ కి గ్యాప్ లభించడంతో వెంటనే ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అదీగాక ఈ వెకేషన్ లో ఫ్యాన్స్ కి కొత్త సర్ప్రైజ్ ఇచ్చాడు బన్నీ.
సినిమా సినిమాకి మధ్య ఖాళీ సమయం దొరికినప్పుడు సెలబ్రిటీలు ఫ్యామిలీస్ తో ఫారెన్ టూర్స్ కి వెళ్లడం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్టార్ హీరోలు ఫ్యామిలీస్ తో వెళ్ళినప్పుడు వాళ్ళ టూర్ పిక్స్ ఎప్పుడైనా వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ టూర్ వెళ్తున్న విషయం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అదేంటీ.. హీరోలు ఫారెన్ టూర్స్ కి వెళ్లడం మామూలే […]