తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం.. సవాళ్లకు ఎదురెళ్లి ఢీకొనే నైజం.. మూస ధోరణికి చరమగీతం పాడే ఆలోచనలు ఆయన సొంతం.. ఆయనే ఘట్టమనేని కృష్ణ. కౌబాయ్ గా, గూఢాచారిగా, అల్లూరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటి వరకు మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించి.. ప్రపంచానికి చాటి చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. గుండె నొప్పితో ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ […]