తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు నెలలో వార్షిక బ్రమహ్మోత్సాల దృష్ట్యా 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే ఆ తొమ్మిది రోజులు స్వామివారి ప్రత్యేక దర్శనాలు అన్నీ రద్దు చేశారు. కేవలం సర్వ దర్శనం ద్వారానే భక్తులకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి […]