జీవితంలో చోటుచేసుకున్న కష్టాలు, అవమానాలే విజయానికి సోపానాలు. ఇటువంటి అనుభవ పాఠాలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి దోహదపడతాయి. సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఇదే రీతిలో ఓ యువకుడు తన చిన్న తనంలోనే తండ్రి చనిపోయినప్పటికి తల్లి కష్టం తో చదువుకుని దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన ఐఎఎస్ సాధించి ఆ తల్లి కష్టానికి ప్రతిఫలం అందించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది.
వివాహితపై కుత్తీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే, కుత్తీస్పై ఆమె తిరిగి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఇద్దర్నీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత రోజు కూడా కౌన్సిలింగ్ రమ్మన్నారు.
ఒకప్పుడు రాత్రిపూటే దొంగతనాలు అధికంగా జరిగేవి. కానీ ఇప్పుడు పగటి పూట కూడా యథేచ్ఛగా చోరీలు జరుగుతున్నాయి. ముఖ్యంగ చైన్ స్నాచర్లు మాత్రం రెచ్చిపోతున్నారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి రాజకీయలపై ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ఫైర్ బ్రాండ్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇలా సీరియస్ పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి..డ్యాన్స్ చేశారు. అది కూడా మాములు డ్యాన్స్ కాదు.. ఊరా మాస్ డ్యాన్స్ చేస్తూ అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు.. కాలం కలిసి రాకుంటే తాడే పామై కాటు వేస్తుందని పెద్దలు అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఆర్టీవో ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ముక్కలు ముక్కలుగా పేలిపోయాడు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 60వ రోజుకి చేరుకుంది. 60వ రోజు పాదయాత్ర రాప్తాడు యోజకవర్గంలోని పంగల్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
జంతువుల్లో అత్యంత విశ్వాసం కల జీవిగా కుక్క వేళ ఏళ్లుగా పేరు తెచ్చుకుంది. ఓ ముద్ద అన్నం పెడితే.. జీవితాంతం యజమాని పట్ల విశ్వాసంగా ఉంటుందని చెబుతారు. మరి అలాంటి శునకం.. ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రజలపై ఎడాపెడా దాడి చేస్తూ.. మనుషుల పాలిట పెద్ద శత్రువగా తయారయ్యింది. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది..
'ఈ ఐటమ్స్ తింటే రూ.లక్ష మీవే..!' అంటాడేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది వాస్తవం. మీరు చేయాల్సిందల్లా.. కూర్చొని కడుపుబ్బా తినడమే. దీనికోసం ఎక్కడికో పోవట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో 20కి పైగా బ్రాంచులున్నాయి. ఎక్కడికైనా వెళ్లొచ్చు.. తినొచ్చు.. లక్ష గెలవచ్చు. ఎలా..? ఏంటి ఈ పోటీ..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, పార్టీని పటిష్టం చేయడం కోసం.. టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గాయపడ్డారని సమాచారం. ఆ వివరాలు..