టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు వినగానే గుర్తుకొచ్చేంది ఆరు బంతుల్లో ఆరు సిక్సులు. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ ఆరు బంతుల్లో ఆరు క్లీన్ సిక్సులతో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత అనేక మ్యాచ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్‌తో టీమిండియా ఒంటిచేత్తో విజయాలు అందించాడు. 2011 వన్డే వరల్డ్ కప్ భారత్ గెలిచిందంటూ అందుకు ప్రధాన కారణం యువరాజ్ సింగ్. ఆ వరల్డ్ కప్‌లో యువీ మ్యాచ్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇలా తన ప్రత్యేకమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్‌పై చెరగని ముద్రవేసిన యువీ.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యువీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి. క్రికెట్ ఫ్యాన్స్ యువీ సిక్సులు చూసి కూడా చాలా కాలం అయింది. కానీ.. త్వరలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీతో యువీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. ఈ టోర్నీ కోసం యువీ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రాక్టీస్‌లో భారీ సిక్సులు బాదుతూ.. పాత యువరాజ్ సింగ్‌ను గుర్తుకు తెచ్చాడు. తన ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యువీ పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు పాత యువరాజ్‌ను చూస్తున్నట్లు ఉందని. ఆ షాట్లు చూస్తుంటే 2007లో కొట్టిన ఆరు సిక్సులు గుర్తుకు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. క్రికెట్‌కు దూరమై చాలా కాలం అయినా యువీ బ్యాటింగ్‌లో ఏ మాత్రం పవర్ తగ్గలేదు అన్నట్టు అర్థం అవుతుంది. మరి ఇదే జోరును లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో కూడా చూపిస్తాడని ఆశిద్దాం. మరి యువీ బ్యాటింగ్ ప్రాక్టీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Didn’t do too bad, did I? Super excited for what’s coming up! pic.twitter.com/MztAU5nyZJ — Yuvraj Singh (@YUVSTRONG12) August 16, 2022 ఇది కూడా చదవండి: గదిలో అందరున్నా.. ఒంటిరిగా ఫీలయ్యా: విరాట్ కోహ్లీ