టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భారత్‌కు రెండు ప్రపంచ కప్‌లు అందించి హీరో. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమైన కెప్టెన్‌లలో ఒకడు. అలాగే ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. ఆ జట్టును ఏకంగా నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. దాంతో పాటు ప్రతిఏడాది ఆ జట్టును పాయింట్ల పట్టికలో ఉన్నతంగా నిలిపాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి CSKను ఒక బలమైన జట్టుగా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ధోని అంటే చెన్నై.. చెన్నై అంటే ధోని అనేంతలా తన ముద్రవేశాడు. CSKను అన్నితానై నడిపించిన ధోని అనూహ్యంగా గురువారం కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
తన నిర్ణయంతో CSK ఫ్యాన్స్‌తో పాటు సాధారణ క్రికెట్ అభిమానులను సైతం షాక్‌కు గురిచేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని ఐపీఎల్‌లో కొనసాగుతూ తన అభిమానులకు ఆనందం పంచుతున్నాడు. కానీ శనివారం నుంచి ప్రారంభం అయ్యే ఐపీఎల్ 15వ సీజన్‌లో మాత్రం కేవలం ఒక ఆటగాడినే కొనసాగనున్నాడు. ధోని స్థానంలో CSKను ఆ జట్టు స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా నడిపించనున్నాడు. జడేజాను కెప్టెన్‌గా ఎంపికచేయడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకున్నా.. ధోని ఎందుకు ఇంత ఉన్నపళంగా ఈ నిర్ణయం తీసుకున్నాడనే అనుమానాలు మాత్రం అందరిలో వ్యక్తం అవుతున్నాయి.
ఒత్తిడి కారణంగానా..?
నిజానికి ధోని ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతాడని.. ఇదే ధోని చివరి ఐపీఎల్ సీజన్ అని అంతా భావించారు. అలా జరిగి ఉంటే.. ధోని రికార్డుల గురించి మాట్లాడుకునే వారు తప్ప, ఎందుకు గుడ్ బై చెప్పాడు అనే చర్చ ఉండేది కాదు. కానీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని, ఆటగాడిగా కొనసాగుతుండడంతో ఫ్యాన్స్ అసలు ధోనికి ఏమైంది అనే విషయం చర్చించుకుంటున్నారు. కెప్టెన్సీతో ఒత్తిడి, పనిభారం ఎక్కువ అవుతుందా? అనుకుంటే.. భారత కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో జట్టును అద్భుతంగా విజయపథంలో నడిపించాడు. ఐపీఎల్‌లో CSKకు కెప్టెన్‌గా నాలుగు ట్రోఫీలు అందించడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. దీంతో ధోని కెప్టెన్సీ వదులుకోవడం వెనుక ఒత్తిడి అసలు కారణమే కాదు అనేది స్పష్టం.
ఇదీ చదవండి: CSKకి కెప్టన్సీపై జడేజా ఫస్ట్ రియాక్షన్! వీడియో వైరల్
ధోని ఏం చేసినా దాని వెనుక ఒక పరమార్థం..
ధోని తన కెరీర్ కంటే జట్టు కోసమే ఎక్కువగా ఆలోచిస్తాడు. అది టీమిండియా కెప్టెన్‌గా తప్పుకున్న సమయంలోనే రుజువైంది. కెప్టెన్‌గా జాతీయ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్న సమయంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తన తర్వాత విరాట్ కోహ్లీ కూడా టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. తన కెరీర్ కంటే టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. తను ఉండగానే జట్టుకు ఒక మంచి కెప్టెన్‌ను తయారు చేయాలనే ఉద్ధేశంతో కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చి అతను రాటుదేలే వరకు సపోర్టుగా ఉన్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విషయంలో కూడా ధోని అదే చేశాడు. ఎలాగో తను ఈ సీజన్‌లేదా.. 2023 సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకుంటానన్న విషయం ధోనికి తెలిసిందే. జట్టు నుంచి ఒక్కసారిగా దూరమైతే.. పటిష్టంగా ఉన్న CSKలో అలజడి రావచ్చు. అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. అందుకే.. తన జట్టులో ఉండగానే మరో కెప్టెన్‌ను తయారుచేసి.. అతనికి సపోర్టుగా ఉంటూ.. మెల్లిగా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని ధోని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జడేజాను కెప్టెన్‌గా నియమించి.. అతనికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తూ.. అతన్ని ఒక బలమైన సారథిగా చేసి పూర్తిగా తప్పుకోవాలని ధోని CSK కెప్టెన్సీని వదులుకున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని CSK మేనేజ్‌మెంట్‌కు వివరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే ధోని నిర్ణయాన్ని CSK మేనేజ్‌మెంట్ కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. లేదంటే ధోని లాంటి వ్యక్తి కెప్టెన్సీ వదులుకుంటే ఏ ఫ్రాంచైజ్ మాత్రం ఒప్పుకుంటుంది. కానీ ధోని ఏది చేసినా అది తనకంటే జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ధోని గొప్ప ఆటగాడే కాదు.. అంతకంటే కూడా ఒక గొప్ప నాయకుడు. మరి ధోని CSK కెప్టెన్సీ వదులుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోనీ కెప్టెన్సీ వదులుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఎమోషనల్ ట్వీట్!
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
Legendary captaincy tenure in yellow skip. A chapter fans will never forget. Respect always. ❤️💛 @msdhoni pic.twitter.com/cz5AWkJV9S
— Virat Kohli (@imVkohli) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.