వణికిస్తున్న వెస్టిండీస్‌ ప్లేయింగ్‌ లెవన్‌!

westindies t20

టెస్టు, వన్డే అయితేనే వెస్టిండీస్‌ని కట్టడి చేయడం కష్టం. టీ20 ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే, ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ అంటే ఏ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా వరల్డ్‌కప్‌ టీ20 జట్టును ప్రకటించింది వెస్టిండీస్‌ బోర్డు. అందులో పేర్లు చూసి అందరూ అవ్వాక్‌ అవుతున్నారు. రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన ఏకైక జట్టు కూడా వెస్టిండీసే. ఈ సంవత్సరం కూడా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్నారు. వెస్టిండీస్‌ అంటేనే ప్రత్యర్థి జట్టులో ఓ రకమైన భయం.. ఆందోళన మొదలవుతుంది. అందుకు కారణం లేకపోలేదు. వారిలో ఓపెనర్‌ నుంచి టెయిలెండర్‌ దాకా అందరూ నిలుచున్న చోటునుంచే సిక్సులు కొట్టగల దిట్టలు. ఈసారి టీమ్‌ని చూసిన అదే అనిపిస్తోంది. అందరూ హిట్టర్లే ఉన్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ వెస్టిండీసే ఫేవరెట్‌ కాబోతోంది.

ఈ జట్టులో మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత రవి రాంపాల్‌ జట్టులో స్థానం పొందాడు. ఇక వారి జట్టు ప్లేయింగ్‌ లెవెన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ అంచనా వేస్తే సిమ్మన్స్‌, ఎవిన్ లూయిస్‌ ఓపెనర్లుగా దిగుతారు. ఫస్ట్‌ డౌన్‌లో విధ్వంసకర ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌ వస్తాడు. అక్కడికే స్కోర్‌ బోర్డు దాదాపు పరుగులు పెట్టి ఉంటుంది. పూరన్‌, హెట్‌మైర్‌, పొలార్డ్‌, ఆండ్రే రస్సెల్‌ ఇక్కడి దాకా మ్యాచ్‌ రావడం అంటే గొప్పనే చెప్పాలి. వారి తర్వాత ఫ్యాబియన్‌ అలెన్‌, డ్వైన్‌ బ్రావో, ఒషేన్‌ థామస్‌, రవి రాంపాల్‌ వస్తారని అంచనా.

వెస్టిండీస్‌ లైనప్‌ చూసి ఈసారి కప్‌ కొట్టేది వాళ్లే అని సోషల్‌ టాక్‌ మొదలైంది.. దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.