క్రికెట్.. దీనిని జెంటిల్మన్ గేమ్ అని అంటారు. అయితే అలా పిలవడమే కాదు.. ఆటలో ప్లేయర్లు కూడా అంతే హుందాగా ప్రవర్తిస్తుంటారు. చాలా ఆటల్లో ప్లేయర్ల దురుసు ప్రవర్తనకు వారిపై ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ ప్రయోగిస్తుంటారు. కానీ, క్రికెట్ లో అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సందర్భంలో అంపైర్లు పెనాల్టీ వేస్తుంటారు. ఎంత జెంటిల్మన్ ఆట అయినా.. క్రికెట్లోనూ కొన్నిసార్లు స్లెడ్జింగ్, ఉద్దేశపూర్వకంగా త్రోలు చేయడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి విటాలిటీ టీ20 బ్లాస్ట్ లో జరిగింది. వెంటనే స్పందించిన ఆన్ ఫీల్డ్ అంపైర్ ఆ జట్టుకు 5 పరుగులు పెనాల్టీ విధించాడు. విటాలిటీ టీ20 బ్లాస్ట్ లో భాగంగా.. వార్విక్ షైర్- డెర్బీ షైర్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్ లో 13వ ఓవర్ వేసేందుకు వచ్చిన విండీస్ స్టార్ బౌలర్ బ్రాత్‌వైట్ చేసిన పనికి ఆ జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఓవర్లో మూడో బంతిని బ్రాత్‌వైట్ యార్కర్ వేయగా.. మాడ్సన్ ఆ బంతిని పుల్ చేశాడు. ఆ తర్వాత సింగల్ కోసం ప్రయత్నించి.. నాన్ స్ట్రైకర్ వద్దనడంతో విరమించుకున్నాడు. అయితే ఆ బంతిని అందుకు బ్రాత్‌వైట్ వెంటనే వికెట్స్ వైపు త్రో చేశాడు. ఆ బంతి మాడ్సన్ పాదానికి గట్టిగా తాకింది. వెంటనే బ్రాత్ వైట్ మాడ్సన్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే ఇదంతా గమనిస్తున్న ఆన్ ఫీల్డ్ అంపైర్ ఈ ఘటనపై స్పందించాడు. లెగ్ అంపైర్‌తో సంప్రదించిన తర్వాత 5 పరుగులు పెనాల్టీ విధించాడు. అంతేకాకుండా దానిని డెడ్ బాల్ గా పరిగణించి.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా రద్దు చేశారు. తర్వాత ఆ ఓవర్లో ప్లేయర్లు చేసిన 8 పరుగులు + పెనాల్టీగా వచ్చిన 5 పరుగులు కలిపి మొత్తం 13 పరుగులు స్కోర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బ్రాత్ వైట్‌ను తప్పుపట్టగా.. మరికొందరు మాత్రం బ్రాత్ వైట్ చేసిన దానిని సమర్థిస్తున్నారు. మాడ్సన్ పరుగు తీసేందుకు ప్రయత్నించి.. విరమించుకున్నాడు. ఆ సమయంలో వెంటనే బ్రాత్ వైట్ త్రో చేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు బ్రాత్ వైట్ చేసిన పాపం ఊరికే పోలేదు.. అందుకే వారికి 5 పరుగుల పెనాల్టీ పడింది.. అంటూ కామెంట్ చేస్తున్నారు. బ్రాత్ వైట్ త్రో చేయడంలో తప్పులేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Not ideal for Carlos Brathwaite A 5-run penalty was given against the Bears after this incident...#Blast22 pic.twitter.com/pXZLGcEGYa — Vitality Blast (@VitalityBlast) June 19, 2022 ఇదీ చదవండి: ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కదు: ఆశిష్ నెహ్రా ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించిన భువనేశ్వర్.. టీమిండియాలోనే తొలి పేసర్‌గా!