రన్ మెషిన్ కింగ్ కోహ్లీ మైదానంలో పాదరసంలా కదులుతాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ముచ్చెమటలు పట్టించే విరాట్, ఫీల్డింగ్ చేస్తే అతన్ని దాటి బాల్ వెళ్లడం అంత ఈజీ కాదు. అగ్రెసివ్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్న కోహ్లీ టీమిండియా బెస్ట్ ఫీల్డర్లలో ఒకడు. మెరుపువేగంతో బంతిని అందుకుని బ్యాట్స్‌మెన్‌ను మైదనం విడిచివెళ్లేలా చేయగలడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కళ్లుచెదిరే క్యాచ్‌లు చాలానే అందుకున్న విరాట్ ఐపీఎల్ 2021లోనూ అదరగొడుతున్నాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చూస్తే వావ్ అనాల్సిందే.
19వ ఓవర్లో సిరాజ్ వేసిన బంతిని క్రిస్ మెరిస్ ఆఫ్‌సైట్ అద్భుతమైన బుల్లెట్ షాట్ కొట్టాడు. ఆ బంతిని చిరుతలా దూకి ఒడిసిపట్టాడు కోహ్లి. మళ్లీ అంతే వేగంతో కీపర్‌కు విసిరాడు. రెప్పపాటులో ఏ వేగంతో అయితే బంతి వెళ్లిందో అంతే వేగంతో మళ్లీ తిరిగి రావడంతో మోరిస్ కళ్లుతేలేశాడు. అద్భుత పీల్డింగ్‌ను చూసిన సిరాజ్ కోహ్లీ వద్దకు వెళ్లి మరీ అభినందించాడు. కోహ్లీ ఆ బంతిని ఆపిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బంతిని పట్టుకునేందుకు కోహ్లీ దూకుతున్న ఫోటోను ఇంటర్నేషనల్ షూ కంపెనీ పూమా లోగో అయిన పూమా చిరుత ఫోటోను పక్కపక్కన పెట్టి పూమాకు బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫోటో చూసిన కోహ్లీ అభిమానుల ఆనందానికి మాత్రం అవధులేవు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన అద్భుత విజయం సాధించింది. 149 పరుగులకు రాజస్థాన్ రాయల్స్‌ను కట్టడి చేసిన ఆర్సీబీ. 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను గెలిచింది. ఈ మ్యాచ్ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఇంకో అడుగుముందుకేసింది.
ఇదీ చదవండి: కేఎస్ భరత్ ను కెలికి మరీ సిక్స్ కొట్టించిన క్రిస్ మోరిస్