మరో నాలుగు రోజుల్లో ప్రతిష్టాత్మక ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ నెల 28న భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు చాలా రోజుల తర్వాత బరిలోకి దిగనున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో అనే విషయంపై కూడా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అందుకు కారణం.. కోహ్లీ చాలా కాలం సరైన ఫామ్‌లో లేడు, సెంచరీ చేసి వెయ్యి రోజులపైనే అయింది. పైగా ఇంగ్లండ్ టూర్ తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే టూర్లకు విశ్రాంతి తర్వాత బరిలోకి దిగుతున్నాడు. అందరి దృష్టి కోహ్లీపై ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీకి సూర్యకుమార్ యాదవ్ స్పిన్ బౌలింగ్ వేస్తూ.. ఫ్లైటెడ్ డెలివరీస్‌తో ఊరిస్తుండగా.. కోహ్లీ వాటిపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చాలా కాలంగా ఫామ్‌లోని కోహ్లీ.. తన ట్రేడ్‌మార్క్ షాట్లను ఆడేందుకు కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌లో కొట్టిన షాట్లు చూసి కోమ్లీ.. మళ్లీ టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. దీంతో ఆసియా కప్‌లో కోహ్లీ అదరగొట్టడం ఖాయమని, తన వందో టీ20 మ్యాచ్‌లో చాలా కాలంగా అదని ద్రాక్షలా మారిన 71వ సెంచరీని సాధిస్తాడని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టీస్‌లో కోహ్లీ బ్యాటింగ్ అలా ఉంది మరి. కానీ.. ఆ వీడియో ఇప్పడది కాదు. 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల సమయంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ అది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా.. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌కు కోహ్లీకి మధ్య చిన్న ఫైర్ మూమెంట్ చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య ‘నేనుండగా.. ఎందుకు టెన్షన్’ అంటూ సైగలు చేస్తూ.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైపు గుర్రుగా చూశాడు. ఈ సీన్ తర్వాత ఇద్దరి మధ్య వాతావరణం వేడెక్కినట్లు కనిపించింది. విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ పట్ల సూర్యకుమార్ యాదవ్ ప్రవర్తించిన తీరుపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కానీ.. తర్వాత కోహ్లీ కెప్టెన్సీలోనే సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి వచ్చి పలు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం బలపడి.. నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో కోహ్లీకి బౌలింగ్ కూడా చేశాడు. అదే వీడియో దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: జింబాబ్వే బ్యాటర్ సికందర్ రజాను రౌండప్ చేసిన భారత ఆటగాళ్లు!