రాయుడుపై నోరు జారిన విజయ్ శంకర్! సంచలన కామెంట్స్!

క్రికెట్ టీమ్ లో సరైన ఆల్ రౌండర్ ఉంటే ఆయా టీమ్స్ చాలా బలంగా కనిపిస్తాయి. విదేశీ జట్లలో ఇలాంటి ఆటగాళ్లకి కొదవ లేదు. కానీ.., నిన్న మొన్నటి వరకు టీమ్ ఇండియా ఇలాంటి ఆల్ రౌండర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతూ వచ్చింది. కానీ.., ఇప్పుడు మనకి సర్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా రూపంలో ఇద్దరు మంచి ఆల్ రౌండర్స్ ఉన్నారు. టీమ్ విజయాల్లో కూడా వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ.., వీరు కాకుండా మనకి ఇంకో ఆల్ రౌండర్ కూడా ఉన్నాడు. అతనే విజయ్ శంకర్. ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే 3D ప్లేయర్ . విజయ్ శంకర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇప్పటి వరకు మెరుపులు మెరిపించింది లేదు. కాబట్టి.. అతని సత్తా చాలా మందికి తెలియదు. కానీ.., ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో విజయ్ శంకర్ కి కాస్త మెరుగైన రికార్డ్ ఉంది. కానీ.., అది కేవలం టెస్ట్ లలో మాత్రమే కావడం విశేషం. కాగా.., ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ కి ఆడిన విజయ్ శంకర్ దారుణంగా విఫలం అయ్యాడు. 8 మ్యాచ్ లు ఆడిన ఈ 3D ప్లేయర్ కనీసం 50 పరుగులు కూడా చేయలేకపోయాడు. దీనితో విజయ్ శంకర్ పై ట్రోల్స్ మొదలయాయ్యి. నెటిజన్స్ అంతా 3D అంటూ ఇతన్ని ఆట పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకి ఈ 3D ట్యాగ్ రావడానికి కారణం అంబటి రాయుడే అంటూ విజయ్ శంకర్ కాస్త ఆవేశంగానే స్పందించాడు.

vijay anna 2

2019 వన్డే ప్రపంచకప్ కి టీమ్ సెలెక్షన్ జరిగిన విధానం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అప్పటికే ఫామ్ లో ఉన్న అంబటి రాయుడిని పక్కన పెట్టిన భారత సెలెక్టర్లు.. బ్యాటింగ్ ఆర్డర్లో నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్‌ని ఎంపిక చేశారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ‘‘రాయుడితో పోలిస్తే విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రూపంలో టీమ్‌కి మూడు కోణాల్లో ఉపయోగపడతాడు. అతను త్రీడీ ప్లేయర్’’ అని చెప్పుకొచ్చాడు. దాంతో.. అంబటి రాయుడు ‘‘వరల్డ్‌కప్‌ని చూసేందుకు ఇప్పుడే కొత్త త్రీడీ గ్లాస్‌లను ఆర్డర్ చేశాను’’ అని ట్వీట్ చేశాడు. దీంతో అప్పటి నుండి విజయ్ శంకర్ ని ‘త్రీడీ’ ట్యాగ్ వదలడం లేదు. కాగా.., అప్పటి రాయుడు ఆ ట్వీట్ పై విజయ్ శంకర్ తాజాగా స్పందించాడు. రాయుడు నాకు చేయాల్సిన డ్యామేజ్ చేసేశాడు. కానీ.., నేను ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. 2019 ప్రపంచకప్‌లో నేను మూడు మ్యాచ్‌లాడి.. మెరుగైన ప్రదర్శన కనబర్చా. టీమ్ ఇండియా ప్రపంచ కప్ ఓడిపోవడానికి నేను కారణం కాదు. ఇక ఈసారి ఐపీఎల్ లో నేను విఫలం అయ్యాను. కానీ.., నన్ను రాయుడితో ఎందుకు పోల్చి చూస్తున్నారు? ఐపీఎల్లో నా బ్యాటింగ్ ఆర్డర్ వేరు. అతని ఆర్డర్ వేరు. పైగా.., నేను పూర్తి కోటాలో నా నాలుగు ఓవర్స్ వేయగలను. రాయుడు ఎంత మాత్రం బౌలింగ్ వేయగలడు? ఈ లెక్కన చూసుకుంటే నేను రాయుడి కన్నా మెరుగైన ఆటగాడినే. అయినా.., ఇవేవి ఆలోచించకుండా నెటిజన్స్ నన్ను ట్రోల్ చేస్తూ.., ఎంజాయ్ చేస్తున్నారని విజయ్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి.., వీరిద్దరిలో బెస్ట్ ప్లేయర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.